కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని పుట్టగుంట గ్రామం బుడమేరు ఎత్తిపోతల పథకం వద్ద వైకాపా నేతలు.. కోట్లాది విలువ చేసే ప్రభుత్వ భూమిలో రొయ్యల చెరువులు తవ్వుతున్నారని ఆరోపిస్తూ.. వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు గుడివాడ ఆర్టీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములైనప్పటికీ వందలాది ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని వారు చెబుతున్నారు. చిన్నపాటి వర్షాలొచ్చినా.. పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని కార్మిక సంఘాల నేత మురాల రాజేశ్ చెప్పారు. గ్రామ సర్పంచ్, మండల జెడ్పీటీసీ అభ్యర్థిని భర్త పర్యవేక్షణలో ఈ తవ్వకాలు జరుగుతున్నట్లు వ్యవసాయ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఎటువంటి తవ్వకాలు జరగట్లేదు..