ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర విధానాలు వ్యతిరేకిస్తూ వామపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతం - bharath bandh issues

కేంద్ర ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన బంద్​ ప్రశాంతంగా జరిగింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వామపక్షాల నేతలు బంద్​ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాల నేతలు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.

Protest rallies in krishna district
కృష్ణాజిల్లాలో కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ బంద్

By

Published : Jan 8, 2020, 7:16 PM IST

దేశవ్యాప్త సమ్మె ప్రశాంతం

కేంద్రప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని వామపక్షాలు చేపట్టిన బంద్​ కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. సార్వత్రిక సమ్మెలో విద్యుత్ కార్మికులు నిరాహార దీక్షలు చేపట్టారు. వామపక్ష నేతలు, కార్మికులు అవనిగడ్డ ఆస్పత్రి నుంచి వంతెన వరకూ ర్యాలీ నిర్వహించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కోశాధికారి బి.పుణ్యవతి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు యద్దనపూడి మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దివిసీమలోని ఘంటసాల, మోపిదేవి, నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు మండలాల్లో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గన్నవరంలో భాజపా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. కార్మికులు ఆందోళన చేశారు. కంచికచర్లలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు బంద్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైలవరంలో బంద్​ ప్రభావం పాక్షికంగా కనిపించింది.

ABOUT THE AUTHOR

...view details