ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​: ఉపాధి కార్మికులకు దక్కని చేయూత

లాక్​డౌన్​ కారణంగా అన్ని రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవనోపాధిలో భాగంగా కొంత వెసులుబాటు కల్పించినా... కార్మికులకు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కృష్ణా జిల్లాలో ఉపాధి లేక లక్షల మంది అలమటిస్తున్నారు.

problems for migraine workers due to lock down in Vijayawada
ఉపాధి లేక కార్మికుల ఇబ్బందులు

By

Published : Apr 22, 2020, 4:53 PM IST

ఉపాధి లేక కార్మికుల ఇబ్బందులు

తమకు జీవనోపాధిలో భాగంగా కల్పించిన లాక్​డౌన్ వెసులుబాటు రాష్ట్రంలో అమలు కావట్లేదని కార్మికులు వాపోతున్నారు. నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయిన కారణంగా.. ఈ రంగంపై ఆధారపడిన దాదాపు లక్షల మంది ఉపాధిలేక అలమటిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కార్మిక రంగానికి చేస్తున్న ఉదార సాయం మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు దారిమళ్లించే యత్నం చేయటం సరికాదని హితవు పలుకుతున్నారు. మేస్త్రీలు ఒకపూటి భోజనం మానేసి వలస కార్మికులకు భోజనంపెడుతున్నామని తెలిపారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కార్మికుల సంఘం నాయకునితో ముఖాముఖి ద్వారా అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details