తెలంగాణ అమ్మాయితో, ఆంధ్రకు చెందిన అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ విషయంలో అమ్మాయి ఇంట్లో గొడవలు కారణంగా యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని యువకుని బంధువులు ఆసుపత్రికి చేరుకోగా ఆస్పత్రి వద్ద ఇరు కుటుంబాలకు వాగ్వదం జరిగింది. పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఇరు కుటుంబాలను స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఆంధ్ర అబ్బాయి... తెలంగాణ అమ్మాయి... ప్రేమ వివాదం... - nandigama
తెలంగాణకు చెందిన యువతి, ఆంధ్రా యువకుని మధ్య ప్రేమ... వివాదానికి దారితీసింది. పోలీసుల సమక్షంలో అంతా సద్దుమణిగింది.
ప్రేమవివాదం