ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేట్ పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థల వ్యాజ్యంపై విచారణ 23కు వాయిదా

పవన, సౌర విద్యుత్​ను తీసుకోకుండా డిస్కంలు నిరాకరిస్తున్నాయని ప్రైవేట్ పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టులో దాఖలు చేసిన  అనుబంద పిటిషన్లపై విచారణ ఈనెల 23కు వాయిదా పడింది

By

Published : Jan 8, 2020, 12:50 AM IST

ప్రైవేట్ పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థల వ్యాజ్యంపై విచారణ 23కు వాయిదా
ప్రైవేట్ పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థల వ్యాజ్యంపై విచారణ 23కు వాయిదా

తాము ఉత్పత్తి చేస్తున్న పవన, సౌర విద్యుత్​ను తీసుకోకుండా డిస్కంలు నిరాకరిస్తున్నాయని, కోత విధిస్తున్నాయని పేర్కొంటూ ప్రైవేట్ పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ' పవర్ సిస్టం ఆపరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ సంస్థ నుండి విద్యుత్ కోత అంశానికి సంబంధించి దరఖాస్తు చేసుకొని నివేదికను తెప్పించుకోవాలని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు న్యాయస్థానం సూచించింది .అంతకు ముందు విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... కొన్ని సౌర , పవన విద్యుత్ సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్​ను డిస్కంలు పూర్తిగా నిరాకరిస్తున్నాయన్నారు. బకాయిలును సైతం ప్రభుత్వం నాలుగు వారాల్లో చెల్లిస్తామని చెప్పి చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. ఆ వివరాల్ని ప్రమాణపత్రం రూపంలో దాఖలు చేస్తామన్నారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.

ABOUT THE AUTHOR

...view details