రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కృష్ణా జిల్లా ఉయ్యూరు సర్కిల్ పోలీసులు సోమవారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయడం ప్రారంభించారు. మాస్కులు లేకుండా ప్రధాన వీధుల్లోకి వచ్చిన వారికి జరిమానా విధిస్తున్నారు.
రూ. 120 నుంచి రూ.150 వరకు.. మాస్కులు ధరించని వారి నుంచి వసూలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి అరికట్టే దశలో ఈ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సీఐ నాగప్రసాద్ కోరారు.