కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని అనంతవరం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద టాస్క్ఫోర్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంయుక్తంగా తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు మైలవరం ఎక్సైజ్ సీఐ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ పెద్దిరాజులు వివరాలు వెల్లడించారు. 407మద్యం బాటిళ్లు, 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశమన్నారు.
అనంతవరం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద మద్యం పట్టివేత - అనంతవరం బోర్డర్ చెక్ పోస్ట్ వార్తలు
కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని అనంతవరం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద టాస్క్ఫోర్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అనంతవరం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద మద్యం పట్టివేత