కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతవరం, పంగిడి చెరువు ప్రాంతాల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. 1871 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోగా.., 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మూడు ఆటోలు, ఒక బైక్ సీజ్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా హోమ్ గార్డ్‌కు డీఎస్పీ శ్రీనివాసులు రివార్డ్ అందజేశారు.
పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్న పోలీసులు... 11 మంది అరెస్టు - illegal liquor transport latest news update
అనంతవరం, పంగిడి చెరువు ప్రాంతాల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్న పోలీసులు