కృష్ణాజిల్లా మొవ్వ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బీబీ రహమత్ అనే మహిళ(selling marijuana)ను కూచిపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆమె నుంచి 530 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. గంజాయి విక్రయించే ముఠాలో ఆమె ఒక సభ్యురాలు అని కూడా పోలీసులు గుర్తించారు.
Lady arrested: బస్టాండ్‌లో అనుమానంగా సంచరిస్తూ.. ఆమె ఏం చేసిందంటే..? - గంజాయి విక్రయిస్తున్న మహిళ
బస్టాండ్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.
గంజాయి విక్రయించే మహిళ
ఈ నెల 11వ తేదీన గంజాయి విక్రయించే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొవ్వ మండలం నిడుమోలు గ్రామంలో వీరిని అరెస్టు చేసి, రూ.46 వేల విలువైన 2 కిలోల 680 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠాలో రహమత్ కూడా ఒకరని తాజాగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి:ARREST: గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ యువకులు.. ఎలాగంటే..