ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు కళాశాలలు తమను చేర్చుకోవడం లేదని ధర్నా - జీవో 56,57 వార్తలు

గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ కళాశాల ఎదుట పీజీ వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పీజీ సీట్లు పొందినా.. ప్రైవేటు కళాశాలలు తమను చేర్చుకోవడం లేదని ధర్నా చేపట్టారు. ప్రభుత్వం సవరించిన జీవో 56,57లను కళాశాలలు అడ్డుకుంటున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

pg medical college
pg medical college

By

Published : Jun 10, 2020, 4:02 PM IST

పీజీ వైద్య సీట్లు పొందిన విద్యార్థులను ప్రైవేట్ కళాశాలలు చేర్చుకోవడం లేదు. దీంతో గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తెచ్చిన జీవో 56, 57లను కళాశాలలు అడ్డుకుంటున్నాయంటూ ధర్నా చేశారు. థాంక్యూ సీఎం సార్ అంటూ వైద్యకళాశాల ముందు విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. సీట్లు పొందినవాళ్లు ఈనెల 10లోగా చేరాలని ఆరోగ్య వర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రైవేటు కళాళాలలు తమను చేర్చుకోవడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు.

2013లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 43కి కొన్ని సవరణలు చేశారు. జీవో 43 ప్రకారం రిజర్వేషన్‌ అభ్యర్థి ఓపెన్‌ కేటగిరీలోని ఒక విభాగంలో సీటు తీసుకుని, ఆ తర్వాత అదే అభ్యర్థి రిజర్వేషన్‌ కేటగిరీలో మరో విభాగంలో సీటు పొందితే ...మొదట తీసుకుని వదిలేసిన సీటును ఓపెన్‌ కేటగిరీకే కేటాయించేవారు. దీనిని సవరించి వదిలేసిన సీటును రిజర్వేషన్‌ కేటగిరీకి కేటాయించేలా మార్చారు. ఈమేరకు ప్రభుత్వం వేర్వేరుగా జీవోలు 56,57లను విడుదల చేసింది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 218 కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details