ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో శాశ్వత బీసీ కమిషన్ - ఇకపై శాశ్వత బీసీ కమిషన్... శాసనసభలో బిల్లు

ఆంధ్రప్రదేశ్​కు ఇకపై శాశ్వత బీసీ కమిషన్ రాబోతోంది. శాసన సభలో ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కమిషన్​తో బీసీల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఇకపై శాశ్వత బీసీ కమిషన్... శాసనసభలో బిల్లు

By

Published : Jul 23, 2019, 4:15 AM IST

Updated : Jul 23, 2019, 1:44 PM IST


వెనుకబడిన తరగతుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతోపాటు తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలంటూ వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్​లో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు కానుంది. బీసీలకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలవుతున్న తీరును కమిషన్ ఎప్పటికప్పుడు సమీక్షించి, వారి ఆర్థికాభివృద్ధికి తగిన సిఫార్సులు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం శాసన సభలో బిల్లు ప్రవేశ పెట్టింది. కమిషన్ విధులు, అధికారులు అందులో పొందు పరిచింది.

చైర్మన్​గా హైకోర్టు న్యాయమూర్తి!

బీసీ కమిషన్​కు చైర్మన్​గా ప్రస్తుత లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి వ్యవహరిస్తారు. సామాజిక శాస్త్రవేత్త, బీసీల అంశాలపై పూర్తి అవగాహన ఉన్న ఇద్దరు, ప్రభుత్వ కార్యదర్శి... సభ్యులుగా వ్వవహరిస్తారు.

కమిషన్​కు విశేషాధికారాలు...

కమిషన్​కు విశేషాధికారులు ఉంటాయి. తన ఎదుట విచారణకు హాజరు కావాలని రాష్ట్రంలోని ఏ వ్యక్తినైనా కమిషన్ ఆదేశించొచ్చు. తనకు కావాల్సిన సమాచారాన్ని న్యాయస్థానం నుంచి, ప్రభుత్వంలోని ఏ శాఖ నుంచైనా కోరవచ్చు. బీసీల సంక్షేమానికి ప్రత్యేక సిఫార్సుల కోసం సాంకేతిక, విషయ నిపుణుల సేవలను వినియోగించుకోవచ్చు.

Last Updated : Jul 23, 2019, 1:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details