ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేసి... ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి

అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో ఇప్పటికి అనేకచోట్ల ప్రజలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి... నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు సంస్థ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

people cheat in the name of giving jobs at krishna district
కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేసి... ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి

By

Published : Dec 11, 2020, 7:59 PM IST

మీరు ఉంటున్న ఊళ్లోనే ఉద్యోగాలిస్తాం.. నెలకు రూ.25 వేల జీతం వస్తుంది. అయితే ప్రాసెస్ ఫీజు కోసం కొంత నగదు చెల్లించాలంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయల్లో నగదు వసూలు చేశారు ఆ కేటుగాళ్లు. ఉద్యోగాలు వచ్చేశాయి... శిక్షణ పూర్తి అయిన వెంటనే విధుల్లో చేరడమేనంటూ బాధితులను విజయవాడకు పిలిచారు. శిక్షణ వాయిదా వేశారు. అనుమానం వచ్చిన బాధితులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కన్సల్టెంట్ ఏర్పాటు చేసి..

నగరంలో గ్లోబల్ ఫెసిలిటీ పేరుతో ఓ కన్సలెంట్ సంస్థను ఏర్పాటు చేసి.. బీఎస్ఎన్ఎల్ టవర్స్ నిర్వహణకు ఉద్యోగస్తులు కావాలంటూ ప్రచారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. మీ ఊళ్లోనే టవర్స్ ఏర్పాటు చేస్తున్నాం.. అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చని నమ్మించారు. ప్రాసెస్ ఫీజు కింద రూ.25 వేల నుంచి 4 లక్షల వరకు నగదు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు 40 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే గ్లోబల్ ఫెసిలిటీ కంపెనీ హైదరాబాద్​లో మరో కంపెనీకి అనుబంధంగా ఏర్పాటు చేశారని దర్యాప్తులో తెలినట్లు వారు వివరించారు. సంస్థ నిర్వాహకులు కిషోర్ రెడ్డి , రవివర్మ, శ్రీనివాస్​లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి:

మరో 4 రోజుల్లో వింత వ్యాధి నిర్ధరణ: వైద్యారోగ్యశాఖ కమిషనర్‌

ABOUT THE AUTHOR

...view details