కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్నా నాయకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండీ.. నిబంధనలు పాటించకుండా అనిల్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లిలో సచివాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడానికి ఎమ్మెల్యే వెళ్లారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్కు గ్రామంలోని వైకాపా కార్యకర్తలు పూలు చల్లి భారీ ర్యాలీ నిర్వహించారు.
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ..ఎమ్మెల్యే భారీ ర్యాలీ - పామర్రు ఎమ్మెల్యే ర్యాలీపై వార్తలు
కరోనా సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకుండా కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారు. పమిడిముక్కల మండలం లంకపల్లిలో సచివాలయ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కనీసం మాస్కు ధరించకుండా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పామర్రు ఎమ్మెల్యే ర్యాలీ
ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. కోలుకుని తిరిగి కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే కనీసం మాస్కు కూడా ధరించలేదు. కనీసం ర్యాలీలో పాల్గొన్న వైకాపా కార్యకర్తలు మాస్క్లు ధరించకుండా నిర్లక్ష్యంగా జనాల్లో తిరుగుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: 'అమ్మభాష'ల ఉనికి పోరు.. ప్రపంచీకరణతో ప్రమాదం