వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు,ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీఓ 60 , 61 , 82 , 63 , 64 , 65 ఉత్తర్వులను వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జారీచేశారు.ఈ ఉత్తర్వుల ద్వారా మొత్తం 9,712 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 5,701 పోస్టులను కొత్తగా సృష్టించారు. మిగిలిన పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నవేనని అధికారులు తెలిపారు .
- అసిస్టెంట్ ప్రొఫెసర్లు , సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇతర పోస్టులు వైద్యుల పోస్టుల భర్తీ జాబితాలో ఉన్నాయి.
- ఇవి కాకుండా ఖాళీగా ఉన్న 804 పోస్టులను భర్తీ చేస్తారు .
- పొరుగు సేవల కింద 1,021 పోస్టుల భర్తీ బోధనాసుపత్రుల అవసరాల కోసం వేర్వేరు కేటగిరీల్లో 218 భర్తీ చేయనున్నారు .
- వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని సామాజిక , ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో అవసరాల కోసం 46 పారా మెడికల్ , నర్సింగ్ ఆర్డర్లీ వంటి 111 పోస్టులను భర్తీ చేస్తారు.
- ప్రజారోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అవసరాల కోసం 41 పారా మెడికల్ , 174 ఎంఎజ్, 131 ఎఫ్ఎన్ఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది .
- ఒప్పంద విధానంలో 5,574 నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
- రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల అవసరాలకు కలిపి పొరుగు సేవల విధానంలో 964 డేటా ఎంట్రీ ఆపరేటర్, పారా మెడికల్ పోస్టులను భర్తీ చేస్తారు.