ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలివ్‌రిడ్లీ తాబేళ్లకు ఏది రక్షణ..?

అరుదైన ఆలివ్‌ రిడ్లీ జాతి తాబేళ్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ సముద్రపు తాబేళ్లు ఒడ్డుకు చేరుకునే క్రమంలో ఎన్నో ఆపదలు ఎదుర్కొంటున్నాయి. ఆ మూగజీవుల సంరక్షణకు కేంద్రప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నా... మరణాలు మాత్రం ఆగడం లేదు.

olive redly tortoise at dangerous zone
ప్రమాదకర స్థితలో ఆలివ్​ రిడ్లీ తాబేళ్లు

By

Published : Dec 8, 2019, 8:39 AM IST

తాబేళ్లలో ఆలివ్‌రిడ్లీ జాతి ఎంతో ప్రత్యేకం. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు వలస వెళ్తాయి. వీటిలో 7 జాతులుండగా... 5 జాతుల తాబేళ్లు మన రాష్ట్రతీరానికి వలస వస్తాయి. మన సముద్రతీరాన జన్మించే తాబేళ్లు 10సంవత్సరాల తర్వాత మళ్లీ ఇక్కడికే వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఇలా ఏటా లక్షలాది తాబేళ్లు ఒడిశాతో పాటు ఏపీ తీరానికి వలస వస్తాయి.

నదులు సముద్రంలో కలిసే చోటు ఆలివ్‌ రిడ్లీ జాతి తాబేళ్ల సంతానాభివృద్ధికి అనుకూలమైన ప్రాంతం. డిసెంబర్‌ నుంచి మార్చి మధ్య కాలం దీనికి ఆనువైనందునా... ఈ సమయంలోనే వలస వస్తుంటాయి. సముద్రం ఒడ్డుకు చేరుకొని గుడ్లు పెట్టి పొదుగుతాయి. అయితే ఒడ్డుకు చేరే క్రమంలో అనేక కారణాల వల్ల తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. మర పడవల కింద ఉండే పంకలు తగిలి కొన్ని... వేటగాళ్ల వలల్లో చిక్కుకొని మరికొన్ని... ఇలా పెద్ద సంఖ్యలో తాబేళ్లు చనిపోతున్నాయి. వాటి గుడ్లు అడవి జంతువుల పాలవుతున్నాయి.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బంగాళాఖాతానికి ఆనుకొని సుమారు 48వేల 140 ఎకరాల్లో కృష్ణా అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలోనే ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు ఎక్కువగా మరణిస్తున్నాయి. కృష్ణా జిల్లా పాలకాయతిప్ప నుంచి సాగర సంగమం వరకు తిరిగే వాహనాల ధ్వనులకు తాబేళ్లు బెదిరిపోతున్నాయి. సముద్ర తాబేళ్లు గుడ్లుపెట్టే ప్రాంతాలకు, గుడ్లకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం నష్టతీవ్రతను పెంచుతోంది.

తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు... మత్స్యకారులకు అవగాహన కల్పించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

ప్రమాదకర స్థితిలో ఆలివ్​ రిడ్లీ తాబేళ్లు

ఇదీ చదవండి

హమ్మయ్యా... ఆకలి తీర్చింది..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details