ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో పోలింగ్ సరళి పర్యవేక్షణ - కృష్ణాజిల్లాలో పంచాయతీ ఎన్నికలు

కృష్ణాజిల్లాలో పోలింగ్ కేంద్రాలను అధికారులు సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో సీపీ బత్తిన శ్రీనివాసులు పర్యటించారు.

పోలింగ్  కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీపీ
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీపీ

By

Published : Feb 9, 2021, 3:37 PM IST

కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో సీపీ బత్తిన శ్రీనివాసులు పర్యటించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్ని గ్రామాల్లో పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోందని.. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించు కుంటున్నారని అన్నారు. సమస్యాత్మక కేంద్రాలలో అదనపు బలగాలతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం లెక్కింపు సమయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుమన్నారు. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే... చర్యలు తీసుకుంటామన్నామని స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ...

వీరులపాడు మండలంలోని సమస్యాత్మక గ్రామాలలోని ఒకటైన జుజ్జూరు గ్రామంలో ఓటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. విజయవాడ డివిజన్​లోని 14 మండలాల్లో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ను వెబ్ కాస్టింగ్ ద్వారా​ కలెక్టర్ ఇంతియాజ్ పర్యవేక్షిస్తున్నారు. అంబపురంలో పోలింగ్ సరళిని ఏడీసీపీ లక్ష్మీపతి పరిశీలిస్తున్నారు. కంచికచర్లలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు జవ్వాది సుబ్రహ్మణ్యం, జిల్లా అదనపు ఎన్నికల అధికారి పి.సూర్యప్రకాష్ పరిశీలించారు.

ఇదీ చదవండి: జూలూరు పంచాయతీలో స్వల్ప ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details