'నాడు-నేడు' కార్యక్రమం కృష్ణా జిల్లాలో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. పనులు పర్యవేక్షించడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో నాడు-నేడు పనులపై పూర్తి నివేదికతో రావాలని అధికారులను ఆదేశించారు.
'కృష్ణా జిల్లాలో 'నాడు-నేడు' పూర్తిగా విఫలమైంది' - gannavaram latest news
కృష్ణా జిల్లాలో నాడు-నేడు కార్యక్రమం పూర్తిగా విఫలమైందంటూ... రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను పర్యవేక్షించటంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. జిల్లాలో నాడు-నేడు పనులపై పూర్తి నివేదికతో రావాలని అధికారులను ఆదేశించారు.
'కృష్ణా జిల్లాలో నాడు-నేడు కార్యక్రమం పూర్తిగా విఫలమైంది'
స్థానిక పాఠశాలలో సుమారు రూ.65 లక్షలను ఖర్చు చేశామని సిబ్బంది చెప్పగా.. అరకొర టైల్స్, చిన్నాచితకా పనులకే అంత మొత్తం ఖర్చు పెట్టారా అని ఎంఈవో వెంకటరత్నంను రాజశేఖర్ ప్రశ్నించారు. తాను వచ్చానని తప్ప.. మిగిలిన సందర్భాల్లో పాఠశాలను సందర్శించేందుకు ఉన్నతాధికారులు.. కన్నెత్తి కూడా చూడరంటూ చురకలు వేశారు. ప్రభుత్వ ధనం అంటే కనీసం లెక్కలేకుండా పోయిందని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి