ప్రజలకు జవాబుదారీతనంగా పని చేయడం తమ లక్ష్యమని కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు
ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయటం తమ లక్ష్యమని కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం తప్ప వాటి అభివృద్ధి గురించి పట్టించుకోకుండా మాజీ మంత్రి దేవినేని ఉమా గాలికి వదిలేసి ఇప్పుడు అభివృద్ధి పనులు చేస్తుంటే గాలి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. పేదల ఇళ్ల స్థలాలు కోసం పారదర్శకంగా వ్యవహరిస్తున్న తమపై బురద జల్లడం ఉమా నైజమన్నారు. లేనిపోని ఆరోపణలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. పార్టీలకతీతంగా కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో 4వేల మందికి నివేశన స్థలాలు కేటాయించామని తెలిపారు.
ఇదీ చదవండి:సీఎస్, శాసనసభ కార్యదర్శిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి