ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nominations: జోరుగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు - మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ గడువు చివరి రోజు కావడంతో కృష్ణా జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. తెలుగుదేశం, వైకాపా, భాజపా, జనసేన అభ్యర్థులు ఆర్వో కార్యాలయాలకు వెళ్లి నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

నామినేషన్ల పర్వం
నామినేషన్ల పర్వం

By

Published : Nov 5, 2021, 4:34 PM IST

కృష్ణాజిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం కోలాహలంగా మారింది. నామినేషన్ దాఖలుకు ఈరోజు చివరి రోజు కావడంతో వైకాపా, తేదేపా, జనసేన, భాజపా అభ్యర్థులు నామపత్రాల సమర్పణకు మున్సిపల్ కార్యాలయాలకు భారీగా తరలివచ్చారు. కౌన్సిలర్ అభ్యర్థుల వెంట వచ్చే కార్యకర్తలతో కార్యాలయాలు సందడిగా మారాయి. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ అభ్యర్థులు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా చైర్మన్ అభ్యర్థి రంగాపురం రాఘవేంద్ర తరఫున ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి మంత్రి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

జగ్గయ్యపేట పట్టణాన్ని పట్టిపీడిస్తున్న ఈనామ్ భూముల సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. నామపత్రాల సమర్పణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..పట్టణంలో నిర్మించిన సుమారు 4 వేల భవనాలను లబ్ధిదారులకు రూపాయికే ఇస్తున్నామని చెప్పారు. ఉగాది నాటికి అందరికీ గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని 31 వార్డుల్లో వైకాపా అభ్యర్థులే విజయం సాధిస్తారని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కోరారు. ముఖ్యమంత్రి జగన్​ రెండున్నరేళ్ల సంక్షేమ పాలనను చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాయమాటలు చెప్పే వారిని నమ్మవద్దని..,ప్రతిపక్షాలకు ఈ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు.

ఇదీ చదవండి: CBN Letter To SEC:'కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు'..ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ

ABOUT THE AUTHOR

...view details