పోలవరం జలాశయం.. రాష్ట్రానికి జీవనాడి వంటిదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రివర్స్ టెండరింగ్‌పై ప్రభుత్వ వైఖరి సరికాదని కోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలవరాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని హితవు పలికారు. తొందరపాటు నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడుతుందని జగన్ గ్రహించాలన్నారు. విద్యుత్ ఒప్పందాలు, పోలవరంపై కేంద్రం, ప్రాజెక్టు అథారిటీ సూచనలు పాటించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జపాన్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ చర్యలు అభివృద్ధికి దోహదపడదని లేఖ రాసిందని వెల్లడించారు. వ్యక్తిగత పంతాలకు పోకుండా పోలవరం పూర్తయ్యేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం రాష్ట్రానికి జీవనాడి: సుజనా
ప్రభుత్వానికి తొందరపాటు నిర్ణయాలు పనికిరావని భాజపా ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.
సుజనా చౌదరి