కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్, వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు అంతిమ యాత్రలో మంత్రులు పేర్నినాని, కొడాలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భాస్కరరావు నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో నియోజకవర్గానికి చెందిన వైకాపా కార్యకర్తలు, మోకా అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతిమయాత్ర పొడవునా మోకా అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మోకా భాస్కరరావు అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని - news on moka murder case
కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్, మంత్రి పేర్ని నాని ముఖ్యి అనుచరుడు మోకా భాస్కరరావు అంతిమ యాత్రలో వైకాపా కార్యకర్తలు భారీగా హాజరయ్యాయి. మంత్రి పేర్ని నాని, కొడాలి నాని అంతమ యాత్రలో పాల్గొన్నారు.
మోకా భాస్కరరావు అంతిమ యాత్ర
నిన్న ఉదయం చేపల మార్కెట్ వద్ద ఉండగా దుండగులు కత్తులతో ఆయనపై దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలైన భాస్కరరావును స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
ఇదీ చదవండి: వైకాపా నేత దారుణ హత్య.. నిందితుల కోసం పోలీసుల గాలింపు