మోడల్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన హోంమంత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డలో నూతనంగా నిర్మించిన అవనిగడ్డ మోడల్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్ను నియమిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలపగలరని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇంకా చాలా పోలీస్ స్టేషన్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. మహిళా పోలీసులు బందోబస్తు సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారనీ, వారి సమస్యలు దృష్టిలో ఉంచుకొని మెుబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితులకు సత్వర న్యాయం, అవినీతిరహిత పాలనే తమ లక్ష్యం అని మంత్రి వివరించారు.