ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న "మనీ లాండరింగ్ కింగ్ విజయ్ సాయిరెడ్డి" అని ధ్వజమెత్తారు. దేశంలో ఏ దరిద్రం జరిగినా, దాని వెనుక విజయ సాయి, అతని బాస్ ఉంటారనేది, ఇప్పటికే ఈ దేశం ఎన్నోసార్లు చూసిందని విమర్శించారు. అవినీతిపరులతో వాళ్ళకే పని ఎక్కువ అని దుయ్యబట్టారు. తొందరలోనే టైటానియం కేసులో అమెరికా వెళ్ళటానికి వాళ్ళ ఆత్మ సిద్ధంగా ఉందని మండిపడ్డారు. పీఎంఓలో దూరి అది ఆపే సంగతి చూసుకోవాలని హితవు పలికారు.
దేశంలో ఏ దరిద్రం జరిగినా.. దాని వెనక నువ్వే ఉంటావ్ - విజయ్ సాయిరెడ్డి
రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు అవాకులు చవాకులు విసురుకోవటం సహజమే... కానీ తారస్థాయిలో ఓ రాజకీయ నాయకుడు మరొకరిని "దేశంలో ఏ దరిద్రం జరిగినా దాని వెనక నువ్వే ఉంటావ్!" అని సామాజిక మాధ్యమంలో పెట్టడం విమర్శలకు దారి తీస్తోంది.
విజయ సాయి రెడ్డిపై బుద్దావెంకన్న విమర్శలు