ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రాభివృద్ధికి అధికార వికేంద్రీకరణ అవసరం - ministers nanis fires on cbn at machilipatnam

రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి సాధించటానికి అధికార వికేంద్రీకరణ అవసరమని మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని పేర్కొన్నారు. 3 రాజధానులకు మద్దతుగా మచిలీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ministers fires on cbn
చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రులు

By

Published : Jan 14, 2020, 6:55 AM IST

చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రులు
రాష్ట్రం సంపూర్ణాభివృద్ధి సాధించాలంటే అధికార వికేంద్రీకరణ అవసరమని మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని అభిప్రాయపడ్డారు. మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 3 రాజధానులకు మద్దతుగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోనేరు సెంటర్​లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, అమరావతి పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మవద్దనీ, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అధికార వికేంద్రీకరణకు మద్దతు పలకాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details