ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Perni Nani: ప్రయాణం చేస్తూ ప్రజా సమస్యలను విన్న మంత్రి

మంత్రి పేర్ని నాని కారులో ప్రయాణిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బయల్దేరిన ఆయన ప్రయాణ సమయంలోనే ప్రజా సమస్యల విని..తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

minister nani listened public issues while traveling
ప్రయాణం చేస్తూ ప్రజా సమస్యలను విన్న మంత్రి

By

Published : Jun 15, 2021, 6:49 PM IST

రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మూడో విడత వైస్సార్ వాహనమిత్ర కార్యక్రమానికి పాల్గొనేందుకు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయల్దేరారు. ప్రయాణ సమయంలో వీడియో కాన్ఫరెన్స్​ ప్లాట్ ఫాం ద్వారా తన కార్యాలయానికి వచ్చిన పలువురు ప్రజలతో ముఖాముఖిగా సంభాషించారు.

వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరిస్తూ..మెరుగైన పాలన అందిచటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాని వ్యాఖ్యానించారు.

For All Latest Updates

TAGGED:

perni nani

ABOUT THE AUTHOR

...view details