ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kodali: రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి కొడాలి - మంత్రి కొడాలి తాజా వార్తలు

రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేసేలా ఈ ఏడాది చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మిల్లర్లు, మధ్యవర్తుల విధానానికి స్వస్తి పలకనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకున్నా.. రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.

minister kodali nani comments on raitu spandana program
రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోళ్లు

By

Published : Aug 4, 2021, 4:49 PM IST

రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోళ్లు

మిల్లర్లు, మధ్యవర్తుల విధానానికి స్వస్తి పలికి, రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేసేలా ఈ ఏడాది చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్​తో కలసి మంత్రి పాల్గొన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన పలువురు రైతుల తమ సమస్యలను మంత్రికి వివరించారు. అన్నదాతల సమస్యలు సమస్యలను పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను, కలెక్టర్​ను మంత్రి కొడాలి ఆదేశించారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రైతు సమస్యల పరిష్కారానికి జిల్లాలో రైతు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకున్నా.. రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవహరిస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details