కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాన్ని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన....ఇళ్లలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ఒక్క రూపాయికే ఇళ్లను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఒక పద్ధతి ప్రకారం గృహాలను లాటరీ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.
జగ్గయ్యపేటలో టిడ్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి బొత్స - జగ్గయ్యపేటలో మంత్రి బొత్స పర్యటన
జగ్గయ్యపేటలో నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. గృహ సముదాయాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి..త్వరలోనే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
minister bosta satyanarayana