ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సెప్టెంబర్ 5 న పాఠశాలలు పున: ప్రారంభించే అవకాశం' - minister adimulapu suresh riveiw on nadu nend latest update

కొవిడ్-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలల పున: ప్రారంభించే అవకాశముందని మంత్రి ఆదిమూలపు సురేష్​ తెలిపారు. సచివాలయం నుంచి నాడు - నేడుపై సమీక్షించారు.

minister adimulapu suresh review meeting
నాడు నేడుపై మంత్రి ఆదిమూలపు సమీక్ష

By

Published : Jul 20, 2020, 11:00 PM IST

నాడు – నేడులో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనుల నాణ్యతపై రాజీపడొద్దని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకూ ఫర్నీచర్, ఫ్యాన్లు, శానిటరీ తదితర మెటీరియల్స్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు.

సెప్టెంబర్ 5 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశముందని, ఆలోగా 7 నుంచి 10 తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. సచివాలయం నుంచి నాడు నేడుపై సమీక్షించిన మంత్రి మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయలు, అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఆగస్టు మొదటి వారానికి రాష్ట్రంలో గుర్తించిన 30 డెమో స్కూల్స్ లో నాడు – నేడు పనులు పూర్తిచేసి తరగతులకు సర్వం సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

అత్యవసర సేవలు ఆగాయి.. రోగుల ప్రాణాలు పోతున్నాయి!

ABOUT THE AUTHOR

...view details