ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండే ఎండల్లో... మంచు కురిసేదెక్కడో...! - bkrishana

కృష్ణా జిల్లా పెనమలూరులో తెల్లవారుజామున కురిసిన మంచు జనాన్ని ఇబ్బంది పెట్టింది. ప్రయాణికులు, వాహనాదులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నరు.

మండే ఎండల్లో... మంచు కురిసేదెందుకో...!

By

Published : Apr 15, 2019, 10:35 AM IST

భానుడు భగభగమంటున్నాడు. ఇంటి గుమ్మం దాటి రావాలంటేనే భయమేసేంత నిప్పులు కక్కుతున్నాడు. రాత్రిళ్లు చెమటలతో నిద్రపట్టని పరిస్థితి ఉంది. ఇలాంటి వాతావరణంలో కురిసిన మంచు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

కృష్ణా జిల్లా పెనమలూరులో తెల్లవారుజామున ఎడతెరిపిలేకుండా మంచు కురిసింది. శీతాకాలాన్ని తలపించేలా పడిన మంచుతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. 8 గంటల వరకు బయటకు రాలేకపోయారు. మంచు కారణంగా ప్రయాణికులు, వాహనదారులు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. మంచులో వెళ్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని

గ్రహించి... కొందరు నెమ్మదిగా... దీపాల వెలుగుల్లో వెళ్లారు.

మండే ఎండల్లో... మంచు కురిసేదెందుకో...!

ఇదీ చదవండి

ఈవీఎంలపై ఎన్నికల సంఘం X తెలుగుదేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details