తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఒక అగంతకుడు... మహిళపై దాడి చేసి గొంతు కోశాడు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్రాజపురంలో ఈ ఘటన జరిగింది. ఇళ్ళలో పని చేసుకుంటూ ఉన్న ఓ మహిళను... అదే ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి తనతో సహజీవనం చేయాలని వేధిస్తున్నాడు. తనకు పిల్లలు ఉన్నారని అటువంటి వాటికి తాను ఒప్పుకోనని ఆ మహిళ తెగేసి చెప్పింది. కక్ష పెంచుకున్న నాగేశ్వరావు... ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. గురువారం సాయంత్రం పని చేసి ఇంటికి వెళ్తున్న మహిళపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. తలను పట్టుకొని కత్తితో పీక కోశాడు. బాధితురాలు గట్టిగా అరవగా... సమీపంలోని వారు వచ్చి నిందితుడిని అడ్డుకున్నారు. అప్పటికే మెడపై గాయంతో తీవ్ర రక్తస్రావంతో మహిళ రోడ్డుపై కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సహజీవనానికి ఒప్పుకోలేదని... పీక కోశాడు! - machavaram
విజయవాడలోని మొగల్రాజపురంలో మహిళపై ఓ ఆగంతుకుడు కత్తితో దాడి చేశాడు.
దాడి
Last Updated : Sep 6, 2019, 1:59 AM IST