ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిడతల నివారణపై సీఎం జగన్​కు నారా లోకేశ్ లేఖ - సీఎం జగన్​కు లోకశ్ లేఖ వార్తలు

మిడతల ముప్పుపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ సీఎం జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ లేఖ రాశారు. వ్యవసాయరంగాన్ని అప్రమత్తం చేసి రైతులకు సూచనలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

lokesh letter to cm jagan on prevention of locusts in the state
మిడతల నివారుణపై సీఎం జగన్​కు నారా లోకశ్ లేఖ

By

Published : May 29, 2020, 6:23 PM IST

మిడతల ముప్పుపై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ సీఎం జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ లేఖ రాశారు. మిడతల దండు ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలపై దాడి చేసింది... మహారాష్ట్ర నుంచి తెలుగు రాష్ట్రాల వైపు రావచ్చని నిపుణులు అంటున్నారని లేఖలో వివరించారు.

మిడతల వల్ల ఇప్పటికే అనంతపురం జిల్లా రాయదుర్గం రైతులు నష్టపోయారని తెలిపారు. కేంద్రం ఇప్పటికే డ్రోన్లతో పిచికారీ చేయాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిందని... ముంచుకొచ్చే ప్రమాద నివారణకు ప్రభుత్వ సన్నద్ధత ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేసి రైతులకు సూచనలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా మిడతల నివారణ చేపట్టాలని సూచించారు.

మిడతల నివారుణపై సీఎం జగన్​కు నారా లోకశ్ లేఖ

ABOUT THE AUTHOR

...view details