రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకూ 35 కరోనా కేసులు నమోదయ్యాయి. విజయవాడలోనే ఎక్కువ కేసులు పాజిటివ్ రావడం గమనార్హం. కరోనా వల్ల జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కేసుల సంఖ్య పెరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. అనుమానిత లక్షణాలున్న వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
సీపీ పరిశీలన
విజయవాడ నగరంలోని పాతరాజరాజేశ్వరిపేట ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో సీపీ ద్వారకా తిరుమలరావు అక్కడ పర్యటించారు. కరోనా నేపథ్యంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.