ఆంద్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 22 కోవిడ్ చికిత్సా ఆసుపత్రులకు.. రూ.50 లక్షలు విలువ చేసే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను వితరణ చేసినట్లు సంస్థ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ కిషోర్ బాబు తెలిపారు.
సామాజిక సేవా దృక్పథంతో ఇలా ప్రభుత్వ ఆసుపత్రులకు వాటర్ ప్యూరిఫయర్లు, ఏసీలు, ఎల్ఈడీలతో పాటు మరిన్ని ఉత్పత్తులని అందిస్తున్నామని చెప్పారు. కోవిడ్ 19 మహమ్మారి నుంచి ప్రజలను కాపాడే వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందికి తమ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.