ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన తరువాత... సీఎం జగన్ అసలు రంగు చూపిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిదంటూ ఆరోపించిన జగన్... అధికారంలోకి వచ్చాక వాటిని నిరూపించలేకపోవటమే ఆయన చేతకానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. జగన్ ఏడాది పాలనలో పోలవరాన్ని పట్టించుకోలేదని... మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఏడాదిలో చేపట్టిన నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని... హైకోర్టు ఇచ్చిన తీర్పులే ఇందుకు నిదర్శనమని కన్నా విమర్శించారు. భూసేకరణ విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని.... ఆఖరికి మడ అడవులను కూడా నాశనం చేశారని ఆరోపించారు. మరోవైపు కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.