ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక రీచ్​ కార్మికులను ఆదుకోండి

ఇసుక రీచ్​లపై ఆధారపడి బతికే కార్మికులకు ఉపాధి కల్పించాలంటూ కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని లారీ యజమానులను,కూలీలను ఆదుకోవాలని కోరారు.

ఇసుక రీచ్​లపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకోండి

By

Published : Aug 16, 2019, 5:51 PM IST

ఇసుక రీచ్​లపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకోండి

ఇసుక రీచ్​ల్లో పనిచేసే కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ విజయవాడ ధర్నా నిర్వహించింది. రాష్ట్రంలో 70 రోజులుగా ఇసుక కొరతతో వేలాది కార్మికులకు ఉపాధి కరువైందని, ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లు-లారీలు ఇంటికే పరిమితమైయ్యాయని సంఘం ఆరోపించింది. ప్రభుత్వ చర్యలతో లారీ డ్రైవర్లకు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి దాపురించిందని అసోసియేషన్ కార్యదర్శి సదాశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. పుండుమీద కారం మాదిరి వాహనాలకు ఫైనాన్స్, పన్నులు, ఇన్సూరెన్స్​లు కట్టలేని పరిస్థితికి చేరుకున్నామని ఆక్రోశం వెలిబుచ్చారు. తక్షణమే ఇసుక రీచ్​లను పెంచి లారీలు-ట్రాక్టర్లకు అనుమతులిచ్చి వేలాది కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

krishna

ABOUT THE AUTHOR

...view details