రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన స్పందించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్, చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలిపారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు.
'ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు' - ఏపీ స్థానిక ఎన్నికల వివాదం
స్థానికల ఎన్నికల నిర్వహణపై మంత్రి కొడాలి నాని స్పందించారు. కొవిడ్ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
kodalli nani comment on local body elections