కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యే కొడాలి నానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని చిన్న పరిశ్రమల యజమానులు కొడాలి నానిని కలిసి సన్మానం చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని నానికి విన్నవించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసినట్టే చిన్న పరిశ్రమల యజమానులకు విద్యుత్ రాయితీతో పాటు వారికి ఇవ్వవలసిన అన్ని ప్రయోజనాలు సమకూర్చే విధంగా కృషి చేస్తానని కొడాలి నాని హామీ ఇచ్చారు.
'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'
గుడివాడ పట్టణంలోని చిన్న పరిశ్రమల యజమానులు కొడాలి నానిని కలిసి సన్మానం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు.
కొడాలి నానికి చిన్నపరిశ్రమల యజమానుల సన్మానం