క్రీడా స్పూర్తి లేని ఆటగాళ్ల మద్య చోటుచేసుకున్న మనస్పర్థలు వివాదానికి దారితీసాయి.ఫలితంగా గెలిచిన జట్టుపై ఓడిపోయిన జట్టు దాడికి దిగింది.విజయవాడలో ఓ టోర్నీలో పాల్గొన్న ఇందిరాగాంధీ స్టేడియం టీం,లయోలా కాలేజీ టీం కబడ్డి ఆటగాళ్లు ఆట ముగిసాక,అర్ధరాత్రి దాడులకు దిగారు.ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి.మూడు సంవత్సరాలనుండి వారు ఓడిపోవడంతో ఇలా కొట్టారని బాధితులు వాపోతున్నారు.ఈ సంఘటనపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
క్రీడా స్పూర్తి కొరవడిన కబడ్డీ ఆటగాళ్లు
క్రీడాస్పూర్తి తెలియని రెండు కబడ్డీ జట్ల మధ్య గెలుపు,ఓటములు దాడులకు దారి తీసింది. హోరాహోరీ జరిగిన ఆటలో ఓడిపోయిన జట్టు, గెలిచినవారిపై దాడికి దిగిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
kabaddi game in Vijayawada has caused controversy