లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకోవడానికి మేమున్నామంటూ కృష్ణా జిల్లా గుడివాడలో పాత్రికేయులు వలస కూలీలకు భోజనాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఆర్డీఓ సునీల్ కుమార్ ప్రారంభించారు. సమాజంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలను చైతన్యపరుస్తున్నారని ఆయన అన్నారు.
వలస కూలీలకు భోజనం పంపిణీ చేసిన పాత్రికేయులు - lockdown
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఇతర ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కూలీలను పలువురు ఆదుకుంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులకు పాత్రికేయులు భోజనం అందించారు.
వలస కూలీలకు పాత్రికేయులు భోజనం పంపిణీ