ముసాఫిర్ ఖానా భవన నిర్మాణ పనులు నత్త నకడకగా సాగుతున్నాయని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజవర్గం వన్ టౌన్లో నిర్మాణంలో ఉన్న ముసాఫిర్ ఖానాని ఆయన పరిశీలించారు. 2016లో శంకుస్థాపన చేసినా..ఇప్పటి వరకూ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణమన్నారు. స్థానిక నాయకుల సాయంతో వక్ఫ్ ఆస్తులను మంత్రి వెల్లంపల్లి కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింల కోసం ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని దుయ్యబట్టారు.
వక్ఫ్ ఆస్తులపై మంత్రి వెల్లంపల్లి కన్ను: పోతిన మహేష్
విజయవాడ పశ్చిమ నియోజవర్గం వన్ టౌన్లో నిర్మాణంలో ఉన్న ముసాఫిర్ ఖానాని జనసేన పార్టీ నేత పోతిన మహేష్ పరిశీలించారు. 2016లో శంకుస్థాపన చేసి ఇప్పటి వరకూ పూర్తి చేయలేదని విమర్శించారు.స్థానిక నాయకుల సాయంతో వక్ఫ్ ఆస్తులను మంత్రి వెల్లంపల్లి కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
janasena leader pothina mahesh fiers on vellampalli