కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కరోనా లాక్ డౌన్ అమలులో ఉండటంతో ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తూ.. తెదేపా మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య రిలే దీక్ష చేపట్టారు. జగ్గయ్యపేటలోని తన నివాసంలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. మూసిన అన్న క్యాంటీన్ లను వెంటనే తెరవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు మద్దతు ధర అందించి ఆదుకోవాలని, చంద్రన్న బీమా పునరుద్ధరించాలని, కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసు, ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య ఇతర శాఖ అధికారులకు రక్షణ కిట్లను అందించాలని, ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే రిలే దీక్ష - krishna distrct
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య రిలే దీక్ష చేపట్టారు. లాక్ డౌన్ లో ఇబ్బందిపడుతున్న ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు.
తెదేపా మాజీ ఎమ్మెల్యే రిలే దీక్ష