ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టు నిండా పనస కాయలు..!

సాధారణంగా చెట్లు పెరిగి కొమ్మలు వచ్చాక.. ఆ చెట్టుకు పూలు, పండ్లు వస్తాయి. కానీ, ఈ పనస చెట్టుకు మాత్రం చెట్టు మొదలు చుట్టూ కాయలు కాసింది. దానిని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.. కృష్ణా జిల్లా నందిగామ కాకానినగర్ వాసులు.

By

Published : Feb 23, 2021, 11:43 AM IST

jack fruits came from primary branches of the tree at kakani nagara in krishna district
చెట్టు మొదల్లో నుంచి పనస కాయలు..!

చెట్టు మొదల్లో నుంచి పనస కాయలు..!

పనస చెట్టు మొదలు చుట్టు కాయలు కాయటం అందరిని అబ్బుర పరుస్తోంది. కృష్ణాజిల్లా నందిగామ కాకానినగర్​లో రామానుజమ్మ అనే మహిళ ఇంటి ఆవరణలో 20 ఏళ్ల క్రితం పనస చెట్టును నాటారు. ఆవరణ మొత్తం ఉసిరి, మామిడితో పాటు ఇతర చెట్లతో పచ్చదనంతో నిండి ఉంటుంది. వీటిల్లో పనస చెట్టు మొదలు చుట్టూ 30కి పైగా కాయలు కాశాయి. ఇంకా పూత ఉంది. కొమ్మలు లేకుండానే మొదలుకి అన్ని కాయలు కాయటం విశేషం. చెట్టుపై కొమ్మలకు పెద్దగా కాయలు రాలేదు. ప్రత్యేకంగా ఎటువంటి ఎరువులు , పోషణ చేయకపోయిన మొదలు చుట్టూ కాయలు కాయటం గమనార్హం. భూమిలో బలం ఉండటం వల్ల మొదలుకి పూత వచ్చి ఎక్కువ కాయలు కాశాయని.. నందిగామ ఉద్యానవన శాఖా అధికారిని నీలిమ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details