రాముడు జన్మించిన స్వస్థలం అయోధ్యలో రామాలయం కట్టడం ఎంతో సంతోషకరమని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా రామాలయాలు ఉన్నాయన్నారు. కానీ రాముడు జన్మించిన స్వస్థలం అయోధ్యలో మాత్రం ఆయనకు దేవాలయం లేకపోవడం చాలా బాధాకరమని చెప్పారు. ఎప్పటినుండో వాజ్పేయి, ఎల్.కె అడ్వానీ లాంటి పెద్దలు ప్రయత్నించారు. కానీ ఇన్నాళ్లకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రామాలయం గుడి నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన వారందరికీ అభినందనలు తెలిపారు.
"అయోధ్యలో రామాలయం కట్టడం ఎంతో సంతోషకరం" - అయోధ్య రామమందిరం తాజా వార్తలు
రాముడు జన్మించిన స్వస్థలం అయోధ్య. ఇక్కడ రామాలయం కట్టడానికి ఎంతో మంది ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ఆ సంకల్పాన్ని నెరవేర్చటానికి పూనుకున్నారు. ప్రధాని ఆధ్వర్యంలో అయోధ్యలో రామాలయం కట్టడం ఎంతో సంతోషకరమని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలియజేశారు.
మాజీ మంత్రి అయ్యన్న
ఇది మంచి పవిత్రమైన కార్యక్రమమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి హిందువు భాగస్వామి కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి హిందువు పది రూపాయల చొప్పున ఈ గుడి నిర్మాణానికి ఇచ్చి, ఈ పవిత్రమైన దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి