రాష్ట్రంలో మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా... అక్రమార్కులు కొత్త దారులు తొక్కుతూనే ఉన్నారు. రోజుకో రూపంలో ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దులు దాటించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పొట్ట చుట్టూ మద్యం సీసాలను ప్లాస్టర్‌తో అంటించుకుని... రవాణా చేస్తున్న వ్యక్తులను కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోలవరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి వంద మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.
వామ్మో...మద్యం ఇలా కూడా రవాణా చేస్తారా..! - చాట్రాయి వార్తలు
రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. మద్యం బాటిళ్లను టేపు సహాయంతో శరీరానికి చుట్టుకుని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. చాట్రాయి మండలం పోలవరం వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా... మద్యం బాటిళ్లతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు.
పోలవరం వద్ద అక్రమ మద్యం పట్టివేత