తెలంగాణ నుంచి మినీ వ్యాన్ లో నందిగామకు అక్రమంగా తరలిస్తున్న 87 మందు సీసాలను పట్టుకున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. తెలంగాణ నుంచి మద్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి వాహనాలను జప్తు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మద్యం సరఫరా చేస్తున్న ఆరుగురు పోలీసులపై కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో 956 మద్యం కేసులను నమోదు చేశామన్నారు. 617 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 19, 800 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
'తెలంగాణ మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు'
తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో 956 కేసులను నమోదు చేశామని చెప్పారు.
'తెలంగాణ రాష్ట్రం మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు'