ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలు అమరావతి వద్దు అంటే జగన్ కావాలి అంటారామో : అచ్చెన్నా

ప్రజాభీష్టానికి వ్యతిరేకంగానే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు ఉంటున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలు రాజధానిగా అమరావతి వద్దు అంటే.. అప్పుడు సీఎం జగన్ మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని అంటారేమో అని అచ్చెన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు అమరావతి వద్దు అంటే జగన్ కావాలి అంటారామో : అచ్చెన్నా
ప్రజలు అమరావతి వద్దు అంటే జగన్ కావాలి అంటారామో : అచ్చెన్నా

By

Published : Apr 30, 2021, 4:34 PM IST

ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగానే సీఎం జగన్ నిర్ణయాలు ఉంటున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజలంతా రాజధానిగా అమరావతి వద్దు అంటే.. అప్పుడు రివర్స్​లో ఆలోచించి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారేమో అని ఎద్దేవా చేశారు.

5 కోట్ల ఆంధ్రుల నిర్ణయం..

అమరావతి రాజధాని అనే నిర్ణయం ఏ ఒక్క వ్యక్తితో పార్టీదో కాదని, అది 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు సంఘటితంగా తీసుకున్న నిర్ణయమని అచ్చెన్నా స్పష్టం చేశారు. శాసనసభలో అందరి అభిప్రాయాలు తీసుకుని చేసిన ఏకగ్రీవ తీర్మానమని గుర్తుచేశారు.

ఇవీ చూడండి :'అమరావతి రైతులు విజయం సాధించేవరకూ.. మద్దతిస్తాం..'

ABOUT THE AUTHOR

...view details