ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్నత విద్యావంతులు - krishna district latest news

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్నత విద్య అభ్యసించిన వారు బరిలో ఉన్నారు. ఒక్క అవకాశం కల్పిస్తే ఐదేళ్లలో గ్రామాన్ని సమగ్రాభివృద్ధి చేస్తామంటూ జనాల్లోకి వెళ్లారు.

Higher educated people participate in  panchayat election in andhrapradhesh
పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్నత విద్యావంతులు

By

Published : Feb 7, 2021, 8:36 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని కొల్లికొల్ల గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కిషోర్... హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీచేసే అవకాశం రావడంతో... ఎన్నికల బరిలో నిల్చున్నారు. సర్పంచ్ గా తనకు అవకాశం కల్పిస్తే... గ్రామాన్ని సమగ్రాభివృద్ధి చేస్తానని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు.

వత్సవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామానికి చెందిన కొట్టే నాగేశ్వరరావు... ఓ ప్రైవేటు అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. గ్రామంలో ఎన్నికలు జరుగుతుండటంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇస్తున్నారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతానని ప్రచారం చేశారు.

ABOUT THE AUTHOR

...view details