ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. రాజకీయం వద్దు : మంత్రి ఆళ్ల నాని - వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తాజా వార్తలు

కొవిడ్ వ్యాప్తి విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అతలాకుతలం అవుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేసినా తెదేపా అధినేత చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు గందరగోళానికి గురవుతున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని మంత్రి సూచించారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. రాజకీయం వద్దు : మంత్రి ఆళ్ల నాని
ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. రాజకీయం వద్దు : మంత్రి ఆళ్ల నాని

By

Published : Apr 28, 2021, 5:28 PM IST

ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. రాజకీయం వద్దు : మంత్రి ఆళ్ల నాని

రాష్ట్రంలో కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాజకీయం చేయొద్దని తెదేపా అధినేత చంద్రబాబును వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మరోసారి కోరారు. గతంలోనే ప్రజారోగ్యం మీద రాజకీయ విమర్శలు వద్దని చెప్పినా ఆయన పట్టించుకోవట్లేదని మంత్రి ఆళ్ల నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనాపై భిన్నాభిప్రాయాలతో ప్రజలు గందరగోళానికి గురవుతున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని మంత్రి సూచించారు.

ఓడించినందుకే..

ప్రజలు తనను ఓడించారు కాబట్టి వారికి నష్టం చేయాలన్న ఆలోచనతో ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పరిస్థితుల్లో రాజకీయ ఆరోపణలు చేసినా సహించవచ్చు కానీ ఇలాంటి విపరీత విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు సంయమనం పాటించాలని హితవు పలికారు.

సర్కార్ కఠినం..

రెమ్​డీసీవిర్ ఇంజెక్షన్​పై ఓసారి, ఆక్సిజన్​పై మరోసారి ఆరోపణలు గుప్పిస్తున్నారని మంత్రి నాని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత పటిష్ఠంగా ఉన్నా కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతాయని.. అలాంటి వాటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

అండగా ఉండాల్సింది పోయి..

క్లిష్ట కాలంలో ప్రజలకు అండగా నిలబడాల్సింది పోయి ప్రభుత్వ విధానంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రతిపక్ష నేత మంచి సలహాలు ఇస్తే తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉంటే.. తెదేపా అధినేత ఒక్కటీ విలువైన సలహా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.


ఇవీ చూడండి :రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్​కు భరోసా: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details