ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా హయాంలోనే ఎక్కువ అరాచకాలు..విచారణకు సిద్ధమేనా?'

బాధితుల శిబిరాల పేరిట తెదేపా అధినేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైకాపా విమర్శించింది. తెదేపా హయాంలో  అరాచకాలు చేసి ఇప్పుడు తమపై బురద జల్లుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

'తెదేపా హయాంలోనే ఎక్కువ అరాచకాలు సృష్టించారు'

By

Published : Sep 4, 2019, 3:52 PM IST

'అభివృద్ధి ఓర్వలేకే ఇలా చేస్తున్నారు'
తెదేపా హయాంలోనే రాష్ట్రంలో అరాచకాలు జరిగాయని...చాలామంది వైకాపా నేతలు హత్యకు గురయ్యారని ప్రభుత్వ చీఫ్​ విప్​ గడికోట శ్రీకాంత్​రెడ్డి ఆరోపించారు. కాల్మనీ సహా పలు కుంభకోణాలు వారి పాలనలోనే జరిగాయన్నారు. వాటన్నింటిపై విచారణకు తెదేపా సిద్దమేనా అని ప్రశ్నించారు. 'నచ్చిన పది గ్రామాలను ఎంచుకుని అందరం వెళ్దామని..ఎవరు అరాచకాలు చేశారో' అక్కడే తెలిసిపోతుందని సవాల్​ విసిరారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను వెనక్కి పంపేందుకు తెదేపా నేతలు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధికి అడ్డుపడుతూ..రాజకీయం చేస్తున్నారని శ్రీకాంత్​రెడ్డి ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details