కోవిడ్ నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ, పరికరాల వితరణ, ప్రజల్లో చైతన్యం కలిగించేలా ప్రచారం..వివిధ అంశాలపై స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా పోరులో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేసేలా కార్యాచరణ
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోనేందుకు ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వచ్ఛంద సేవా సంస్థలతో సమన్వయం కోసం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థను నోడల్ ఏజెన్సీగా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా పోరులో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తాం
ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించటం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులు, మారుమూల గ్రామాల్లో వైద్య పరికరాలు, అత్యవసర సామాగ్రి వితరణ మరియు వివిధ రకాల సేవల సహకారంపై ప్రభుత్వంతో స్వచ్ఛంద సంస్థలు కలిసి పని చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. వీటి కోసం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.
ఇది చదవండి: